Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో అవగా హన కల్పించారు. ఐసీడీఎస్ అధికారుల సేవలను అభినందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లు, బాలామృతం, తదితరవి అందజేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలున్న ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం పదిమంది గర్బిణులకు సీమంతాలు చేశారు. ఎంపీటీసీ-1 జ్యోతి రజిత యాకయ్య, ఎంపీటీసీ ఇల్లందుల స్రవంతి మొగిలి, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి పాల్గొన్నారు.
మరిపెడ : అంగన్వాడీ కేంద్రాలలో ఉచితంగా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం అందరికీ అందజేయాలని ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, జెడ్పీటీసీ శారద రవీందర్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీ డీఓ కార్యాలయంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్ర మంలో వారు మాట్లాడారు. వైద్యాధికారి రవి, సీడీపీఓ శిరీష, ఎంపీఓ పూర్ణచందర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషశైనం, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
దంతాలపల్లి : మండలంలోని వేములపల్లి గ్రామంలో పోషణ మాసం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ వొలాద్రి ఉమా మల్లారెడ్డి పాల్గొని గర్భిణీలకు సీమంతాలు చేశారు. పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకుంటూ పోషకాహారం అందించా లన్నారు. సూపర్వైజర్ సుధ, సర్పంచ్ నాగిరెడ్డి వసంత , ఏయన్ సుభద్ర,అనూష, నాయకులు పరిషయ్య అంగన్వా డీ టీచర్లు, ఆయాలు పద్మ, స్వరూప, మంగథారు విమల, విజయ లక్ష్మి, కవిత, మాధవి,తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని ఎంపీడీవో శేషాద్రి, ఐసిడిఎస్ సీడీపీఓ ఇందిరా, పీహెచ్సీ డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరితో కలిసి సోమవారం మండల్ లెవెల్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలకు పౌష్టిక ఆహారం లోపం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అంగన్వాడీ ద్వారా అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని అన్నారు. హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు రోజా, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..