Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలో పీసా చట్టాన్ని తుంగలో తొక్కి నామ మాత్రంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారని మండలంలోని రామచంద్రపురం ఎంపీటీసీ భూక్యా లక్ష్మి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలంలో మూడు వైన్ షాపులు సిండికెట్‌గా ఏర్పడి ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు కల్తీ మధ్యం అమ్ముతున్నారని ఆరోపిం చారు. మండలంలో విచ్చలవిడిగా బెల్టు షాపులకు పర్మి షన్ ఇస్తూ రూ.40-రూ.50కి అదనంగా అమ్ముతు న్నారని అన్నారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్‌శాఖ చూడనట్టు షాపు యజమానుల కనుసన్నళ్ళో, మామూళ్ళ మత్తులో జోగుతున్నారని ఆరోపించారు. గతంలో ఎంపీటీసీ పరిధిలో బెల్టు షాపులని నియంత్రిచాల్సిందిగా రాతపూ ర్వకంగా ఇచ్చినా పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. కేవలం మద్యంతో వచ్చే డబ్బులతో ప్రభుత్వాన్ని నడుపు తున్నారన్నారు. రాంచంద్రాపురం ఎంపీటీసీ పరిధిలో నిరుద్యోగ యువత మధ్యానికి బానిసలుగా మారడంతో వారి కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయన్నారు. మద్యం మత్తులో యువత అసాంగిక కార్య కళాపాలకు పాల్పడుతుండడంతో గొడవలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షిణమే రాంచంద్రాపురం ఎంపీటీసీ పరిధి మొట్ల తిమ్మాపరం గ్రామ పంచాయతీల్లో బెల్టు షాపులను నియత్రించాలని, లేదంటే అడ్డుకొని తీరుతామన్నారు. సంబదిత ఎక్సైజ్ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు రాత పూర్వకంగా తెలియజేస్తామని తెలిపారు.