Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
తడి, పొడి చెత్త వేరుతో జీపీలకు ఆదాయం సమకూ రుతుందని సర్పంచ్ కోనేటిస్వామి అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా వీఎస్ఆర్ నగర్ గ్రామంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలకు తడి చెత్త, పొడి చెత్త పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వామి, ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు మాట్లాడుతూ... మూడేండ్లుగా గ్రామపం చాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు అందించామన్నారు. వాటిని ఉపయోగించి గ్రామ పంచాయతీకి చెత్తను అందివ్వడంతో ఐదు క్వింటాళ్ల సేంద్రియ ఎరువు తయారుచేసి విక్రయించగా సుమారు రూ.6000 జీపికి ఆదాయం సమకూరిం దన్నారు. గ్రామస్తులు ఇలాగే సహకరించి గ్రామ అభి వృద్ధికి సహక రించాలని కోరారు. అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చవాన్ నరేష్వా, వార్డు మెంబర్లు కష్ణవేణి, అనసూయ, అన్నపూర్ణ, రాజు, సంజీవరెడ్డి, యువజన సంఘం సభ్యులు ధనంజయకుమార్, పరమేష్, శ్రీకాంత్, మహేష్,మహిళా సంఘం సభ్యులు వాణిశ్రీ, శారద, స్వప్న, రేణుక, మహాలక్ష్మి, హారతి, కొమురమ్మ, తదితరులు పాల్గొన్నారు.