Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్
నవతెలంగాణ-లింగాలఘనపురం
అభివృద్ధికి అడ్డుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిలిచారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శేఖర్ ఆరోపించారు. సోమవారం మండల పరిధి జీడికల్ గ్రామంలో పార్టీ మండల కార్యదర్శి బొడ్డు కర్ణాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి బొట్ల శేఖర్ హాజరై మాట్లాడారు. లింగాల ఘన్పూర్ మండలం జీడికల్ నుండి జనగామ కలెక్టర్ కార్యాలయం వరకు పాద యాత్రను జయప్రదం చేయాలని కోరారు. జనగామ నుండి జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రా స్వామి దేవస్థానం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా తయారైందని, అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చేయట్లేద న్నారు. 20 ఏండ్ల కిందట రోడ్డు నిర్మించారని ఇప్పటి వరకు మూడు సార్లు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. జెడ్పీటీసీ, ప్రజాప్రతినిధులందరూ ప్రజా సమ స్యల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తూటీ దేవదానం, చెన్నూరు ఉప్పలయ్య, మబ్బు ఉప్పలయ్య, మబ్బు వెంకటేష్, షాపురం గోపయ్య, ఊడుగుల కిష్టయ్య, పోలాసు యాదగిరి, మాటూరి నరేష్, వారాల రాజు, వారాల కర్ణాకర్, ముమ్మాడి రమ, తదితరులు పాల్గొన్నారు.