Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జీవో 59 మార్గదర్శకాలకు అనుగుణంగా అనధికార కట్టడాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పటిష్టంగా వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా, మున్సిపల్ ,రెవెన్యూ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో సర్వే, డాక్యుమెంటేషన్ పరిశీలన ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. జీఓ 59 ద్వారా 125 చదరపు గజాల పైబడి ఉన్న గృహాలకు క్రమబద్దీకరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు కాకుండా కట్టడాలు ఉండాలని తెలిపారు. ఆ కట్టడాల నిర్మాణాలు 2 జూన్ 2014 లోగా జరిగినవి ఉండాలన్నారు. విద్యుత్ బిల్లులు, ట్యాక్సుల చెల్లింపు రశీదులు రికార్డు ప్రకారం పరిశీలన చేయాలని అన్నారు. విచారణ చేపట్టి, డాక్యుమెంట్, ఆధారాలు సేకరించా లన్నారు. రికార్డుల సేకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహ చారీ, డీసీఓ ఖుర్షీద్, మార్కెటింగ్ అధికారి వెంకట్రెడ్డి, ఎంప్లా యిమెంట్ ఆఫీసర్ రామకృష్ణ, ఆర్డీఓ రమేష్, మహ బూబాబాద్ తహసీల్ధార్ నాగభవాని పాల్గొన్నారు.