Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి
నవతెలంగాణ-పరకాల
బ్యాండ్ కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేలా చూస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి అన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో రైతు వేదికలో జిల్లా బ్యాండ్ కళాకారుల సమావేశం బ్యాండ్ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా బ్యాండ్ కళాకారులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు . ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ద్టృకి బ్యాండ్ కళాకారుల సమస్యలను తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తాన న్నారు. అర్హులైన బ్యాండ్ కళాకారులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని, రెండు పడకల గదులు మంజూరు చేసేలా చూడాలని ,మండలానికి కమిటీ హాలు మంజూరు చేయాలని, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాండు వృత్తి కళాకారులకు పరికరాలను అందజేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాండ్ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజా సాహెబ్ ,జిల్లా కార్యదర్శి భాష్మియా ,నాయకులు అజీముద్దీన్, అంశావళి ,సాయబెల్లి ,అత్తర్ పాషా ,చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.