Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
- పసుమర్తి సీతారాములు, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూరు
టీఆర్ఎస్ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి గిరిజనుడు కదలి రావాలని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో గిరిజన సమన్వయ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజనులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయేందుకు ఈ కమిటీ దోహదపడుతుందన్నారు.
నూతన కమిటీ ఎన్నిక....
మండల గిరిజన సమన్వయ కమిటీ అధ్యక్షులుగా ధరావత్ జై సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా సాయి కష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమను ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాలు నయక్, కిషన్ నాయక్, రమేష్, సురేష్, కుమార్, బాజీ నాయక్, సోమ్లా నాయక్, రమేష్, కౌన్సిలర్ శంకర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు.