Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్రంలోని కుల వత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనందిస్తుందని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామాల వారిగా చేప పిల్లలను మండల అభివద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం కులవత్తుల వారి ఆర్థికాభివద్ధే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రాభివద్ది, పేదరిక నిర్మూలనకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని కులాల వారికి ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తోందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి 100శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాగా మండలంలోని 26 చెరువులు, కుంటల్లో 6.18 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీరామ్ రాము, బోనగిరి లింగమూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు భిక్షపతి, ముదిరాజ్ సంఘం నాయకులు ముద్దరబోయిన ఎల్లయ్య, ముత్యల నరేష్, అంజయ్య, రాంమూర్తి, రఘుపతి, సోమయ్య, ఎల్లయ్య, మల్లయ్య, యాకయ్య పాల్గొన్నారు.