Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలో మహిళలకు అందుబాటులో షీ టీమ్స్ భరోసా సెంటర్స్ ఉన్నాయని, ఆపద వస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిఐ మోహన్ అన్నారు. సమైక్య డిగ్రీ కళాశాల, వికాస్ జూనియర్, డిగ్రీ కళాశాలలోలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇతర వీడియో మేకింగ్ యాప్లు, ఫేస్బుక్, వాట్స్ యాప్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. ఉద్యోగ అవకాశాల పేరిట మోసాలు, బాలకార్మికులు, బాండెడ్ లేబర్, బాల్య వివాహాలు, అక్రమ దత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. షీ టీమ్ క్యూఆర్ కోడ్, సైబర్ క్రైమ్ డయల్ 100,1098,1930 తదితర వాటిపై అవగాహన కల్పించారు.