Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య గౌడ్
నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్
గీతా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గీతా బంధు ప్రకటించాలని కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య గౌడ్ అన్నారు. మంగళవారం చిల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశం మండల అధ్యక్షులు గణగోని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రమాదవశాత్తు గీతన్న మరణించిన, అంగ వైకల్యం కల్గిన రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియ అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహాసభలకు గీతా కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన ఎస్సై రాజును ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కంకటి రాజన్న, గౌరవ అధ్యక్షులు తాళ్ళపల్లి బొందయ్య, ప్రవీణ్ కుమార్, ఎల్లమ్మ ఆలయ ఛైర్మన్ నంగునూరి రాజు,రమేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.