Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిషన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మహబూబాబాద్
చట్టాలను మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఉక్కు పరిశ్రమను మరుగున పడేసేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విమర్శించారు ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని, రాజ్యాంగబద్ధంగా దక్కిన హక్కును బీజేపీ తుంగలో తొక్కుతోందని ఎమ్మెల్యే విమర్శించారు. నాణ్యమైన ఇనుము కాకపోతే 56 వేల హెక్టార్ల భూమిలో 4 లక్షల టన్నులు ప్రైవేట్ కంపెనీ ఎలా దోచుకెళ్ళిందని ప్రశ్నించారు. ఖనిజ సంపద జాతీయ సంపద అయినప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడంలో అభ్యంతరం ఏమిటని అన్నారు. భూసేకరణ కోసం రాష్ట్రమే సగం వాటా భరించాలి అనడంలో ఆంతర్యం ఏమిటన్నారు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో పేర్కొన్నట్టు అన్ని వనరులు ఉన్న బయ్యారంలో 36 వేల కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం లిఖితపూర్వక హామీ ఉందని అన్నారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే.... ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని ఎందుకు రంగం సిద్ధం చేసిందని ప్రశ్నించారు ఇప్పుడు తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. శాస్త్రవేత్తల బందం సుదీర్ఘ పరిశీలనలో దేశం మొత్తం లోనే ఉన్న ఖనిజం లో ఒక బయ్యారంలోనే 11 శాతం ఉన్నట్లుగా తేలిందన్నారు. పాతిక సంవత్సరాల పాటు 4 లక్షల మెట్రిక్ టన్నులు తీయవచ్చని, గూడూరు, భీమదేవరపల్లి,గార్ల, కారేపల్లి, నేలకొం డపల్లి కలుపుకొని 100 కోట్ల టన్నులు వెలికితీ యవచ్చని నివేదిక ఇచ్చిందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే అభివద్ధి, ఉపాధి రంగం తో పాటు, సంక్షేమం కూడా పరుగులు తీస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాల్సిందేనని డిమాండ్ చేశారు.
గార్ల : విభజన చట్టం లో పేర్కొన్న విధంగా బయ్యారం లో ఉక్కు పరిశ్రమను నిర్మాణం చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం చేత్తులు ఎత్తివేయడం సరైనది కాదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్ మండిపడ్డారు. బయ్యారం లో ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడాన్ని నిరసిస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా అదేశాల మేరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్దానిక నెహ్రూ సెంటర్ లో మంగళవారం ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్రం లో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ పై వివక్షత మరింత పెరిగిందన్నారు. ఇన్నాళ్లు బయ్యారం లో ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపడతామని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు కర్మాగారం నిర్మాణం చేపట్టలేమని ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలు గమనించి బిజెపి ఉచ్చులో పడవద్దని కోరారు. విభజన చట్టం లో పొందుపరచిన విధంగా బయ్యారం లో ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. కార్యదర్శి పానుగంటి రాధాకృష్ణ, సర్పంచ్ ఆర్.శంకర్, నాయకులు పి.లింగయ్య, టి.కోండల్ రావు,చంద్రశేఖర్,నాగభూషణం,వి.వెంకటేశ్వర్లు,ఉమేష్, బాబు తదితరులు ఉన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట పజల హక్కు
కాజీపేట : తెలంగాణ విభజన చట్టంలో కాజీపేట కేటాయించిన కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని గ్రేటర్ వరంగల్ 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు అన్నారు. కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలను చేయడానికి ఖండిస్తూ టీిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో కిషన్ రెడ్డి, ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సంకు నర్సింగరావు మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట ప్రాంత ప్రజల హక్కు, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తెలంగాణ ప్రజలు ఖండించాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, నాయకులు సుంచు కష్ణ, కాటపురం రాజు, పాలడుగుల శివకుమార్, రంజిత్, మర్యలా కృష్ణ, లారెన్స్, వినరు, అఫ్జల్, రఘు, మహిముద్, సర్వర్, తదితరులు పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి ప్రకటన వెనక్కి తీసుకోవాలి
డోర్నకల్ : బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ డోర్నకల్ మండల అధ్యక్షులు నున్న రమణ అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలో మసీద్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టం లో తెలంగాణ కు ఇచ్చిన హామీల అమలు పై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ తెలంగాణ పట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీ కి పుట్టగతులు ఉండవన్నారు. మున్సిపల్ చైర్మన్ వీరన్న,ఎంపీపీ బాలు నాయక్, వార్డు కౌన్సిలర్ లు పోటు జనార్ధన్,సురేందర్ జైన్,సింగిల్ విండో చేర్మెన్ బిక్షం రెడ్డి,మాజీ అధ్యక్షులు సత్తి రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు మియా, రామ్ భద్రం,నాయకులు నాగేశ్వర్ రావు,గౌష్ పాషా, తదితరులు పాల్గొన్నారు.