Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కే దక్కుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జీనుకల కృష్ణాకర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం సేవా పక్వార కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ సంక్షేమ పధకాల లద్ధిదారుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రం లో నరేంద్రమోడీ నేత్రుత్వంలో రెండవసారి అధికారంలోకి వచ్చినతరువాత ప్రపంచంలోనే భారతదేశన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్రమోడీ కి దక్కు తుందని అన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కృష్ణవేణి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి రామరాజు నేత, జిల్లా ఉపాధ్యక్షులు మందల విజయకుమార్ రెడ్డి, కార్యదర్శి పోదేం రవీందర్, ప్రధాన కార్యదర్శి జంగా హన్మంతా రెడ్డి,తోట నరేష్, సీనియర్ నాయకులు పోరిక ఉత్తమ్ కుమార్, కారుపోతుల యాదగిరి, దొంతి రెడ్డి రవి రెడ్డి,మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం,లోడ్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దెన కృష్ణమూర్తి, కుమ్మరికుంట్ల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.