Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
నవతెలంగాణ-రాయపర్తి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలనలో రాయపర్తి మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాయపర్తి, రాగన్నగూడెం, మైలారం, వెంకటేశ్వర పల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి చొరవతో మండలంలోని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొ న్నారు. నిరుపేద కుటుంబాలకు రెండు పడకల ఇండ్లు అందించి ఆదుకున్న నేత ఎర్రబెల్లి అని కొనియాడారు. మం డలంలో రవాణా సౌకర్యంకై పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మిం చారు అని తెలిపారు. అధిక మొత్తంలో మండలానికి నిధు లు మంజూరి చేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతు న్నాడు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్య క్షుడు నరసింహ నాయక్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, సర్పంచులు గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్ రెడ్డి, సుమతి యాదవ రెడ్డి, యాకమ్మ, ఎంపీటీసీ ఐత రాంచందర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ ఉష్మాన్, సుధాకర్, చందు రామ్, రామా రావు, మచ్చ సత్యం, ఉబ్బని సింహద్రి, పాల్గొన్నారు.