Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవ తెలంగాణ-చిట్యాల
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జడలపేట, కైలాపూర్, చిట్యాల, గ్రామాలలో కల్యాణ లక్ష్మి చెక్కులు ఆసరా పింఛన్లు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు, అనంతరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్య మంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోద వీరారెడ్డి జెడ్పిటిసి గొర్రె సాగర్ పిఎసిఎస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో రామయ్య ఎంపీటీసీ కటుకూరి పద్మా నరేందర్ సర్పంచులు లింగరెడ్డి సరోజన సాయి సుధా రత్నాకర్ రెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వరంగల్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధి 16 వ డివిజన్ గరీబ్ నగర్ బొడ్రాయి, కీర్తి నగర్ ఓ ఫంక్షన్ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను స్థానిక కార్పొరేటర్ సుంకరి.మనీషా-శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేట ర్ మాట్లాడుతూ తెలంగాణ లో బతుకమ్మ పండుగ ను రాష్ట్ర పండుగ గుర్తించారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా.ధర్మారెడ్డి లకు కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పోగుల సంజీవ, కక్కెర్ల రవితేజ, తెరాస గీసుగొండ మహిళా అధ్యక్షురాలు కొండ రాధ, మార్త రాజశేఖర్, గోరుకంటి నర్సింహ, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.
గణపురం : ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కర్కపల్లి సర్పంచ్ పొట్ల నగేష్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. కేసీఆర్ ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ అందించి పేద ప్రజలకు పెద్దన్నలా నిలిచిపోయాడని కొనియాడారు.
మొగుళ్ళపల్లి : బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని స్థానిక ఎంపీపీ యార సుజాత అన్నారు. మండలంలోని మేదరమెట్ల, అంకుషాపురం గ్రామా ల్లో మంగళవారం సర్పంచ్ లు కొనుకటి అరవింద్, గాలి చంద్రమౌళి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు, పంచా యతీ కార్యదర్శి శారద, రేషన్ డీలర్లు, పాల్గొన్నారు.
కాశిబుగ్గ : కాశిబుగ్గ లోని నరేంద్ర నగర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భయ్య స్వామి, డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్, నాయకులు బొచ్చు మహేష్, మంద రమే ష్, చిమ్మని గోపి, మదుల కుమార్, కొమురయ్య, రాజేందర్, కిరణ్, సాయి, వంశీ, కవిత, తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : పండుగల బతుకమ్మ చీరెల, ఫిం చన్ల పంపిణీ కార్యక్రమం సాగుతుందని మహబూబ్ నాయక్ తండా సర్పంచ్ మాలోతు పూర్ణ అన్నారు. మహబూబ్ నాయ క్ తండాలో గ్రామపంచాయతిలో మంగళవారం బతుకమ్మ చీరలు, పింఛన్ కార్డు పంపిన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోతు హరిలాల్ నాయక్, వార్డు నెంబర్ శంకర్, ఉమా కిషన్, పంచాయతీ కార్యదర్శి రవి, మాజీ ఉపసర్పంచ్ అజ్మీరా బద్రు నాయక్, నాయకులు రమేశ్, దేవేందర్, కారోబార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయిరెడ్డిపల్లిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారావు, ఎంపిటిసి వినయకుమారి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, పెడ్డకొరుపోలులో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మహబూబ్ పాషా, ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట : తెలంగాణ సంస్కతి, సప్రాదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేపట్టినట్లు వర్దన్నపేట మున్సిపల్ ఆంగోతు అరుణ అన్నారు. పట్టణ పరిధిలోని 2వ వార్డులో వైస్ చైర్మన్ ఏలేం దర్ రెడ్డి, కౌన్సిలర్ తోటకూరి రాజమణితో కలిసి ఇంటింటికి తిరిగి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ సమ్మెట సుధీర్, కో ఆప్షన్ సభ్యులు మాశెట్టి సోమయ్య, డివిజన్ అధ్యక్షుడు తోటకూరి శ్రీధర్, పెద్దబోయిన దేవేంద్ర, కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు.
మహదేవపూర్ : మండలంలోని బొమ్మపూర్లో బతుకమ్మ చీరలను సర్పంచ్ ఓడేటి పద్మా రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పుష్ప లక్ష్మా రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్ర మంలో మండల రైతు సమితి అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, రేషన్ డీలర్ లక్ష్మారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.