Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
కుల నిర్మూలన పోరాటాన్ని వర్గ పోరాటంలో అంతర్భాగం చేద్దామని దళితులపై దాడులు హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి పరికిరత్నం పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలో కోనాపురంలో ప్రజాపంథ సబ్ డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు అధ్యక్షతన జరిగిన సత్యశోధకు సమాజ్ 149వ ఆవిర్బావ దినోత్సవానికి రత్నం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మతోన్మాదం కులోన్మాదం పెచ్చ రిల్లుతూ దేశ ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తూ మారణ హోమాన్ని సష్టిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో జవహర్లాల్, అల్లం నారాయణ, మంటోజ్ లింగయ్య, కోటి, శివ, పిడిఎస్యూ నాయకులు నరేష్ పాల్గొన్నారు.