Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షుడు రవీందర్
నవతెలంగాణ-చిట్యాల
బీసీ,ఎస్సీ,ఎస్టీల స్వరాజ్య స్థాపనకై విశారదన్ మహరాజ్ తలపెట్టిన పదివేల పాదయాత్ర విజయవంతం చేయాలని స్వరాజ్యస్థాపనపై పాటుపడాలని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూరెల్ల రమేష్ మహరాజ్ లు అన్నారు. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజు తలపెట్టిన పాద యాత్ర మండలంలోని నవాబుపేటకు మంగళారం చేరు కుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీ, ఎస్సీ, ఎస్టీల స్వరాజ్య స్థాపనకై పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర 14 జిల్లాలను దాటి నాలుగు వేల కిలోమీటర్ల పైగా పూర్త యిందన్నారు. కార్యరక్రమంలో డిఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు నదునూరి రాజకుమార్, చిట్యాల మండలం ఉపాధ్యక్షుడు నేరెళ్ల రమేష్, కార్యదర్శి మడ్డవాడు కుమార్, మండల కమి టీ సభ్యుడు పర్లపల్లి వంశీ, నవ పేట గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిలుముల రాజు, కార్యదర్శి చిలుముల వంశీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.