Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఏసీఎస్ చైర్మన్ రామారావు
నవతెలంగాణ-మల్హర్రావు
రైతులకు సకాలంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు సకాలంలో అంధించడమే పీఏసీఎస్ లక్ష్యమని చైర్మన్ చెప్యాల రామారావు అన్నారు. తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో మంగళవారం ఇంచార్జీ కార్యనిర్వాహన అధికారి ఎడ్ల సతీష్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ్యుల తీర్మానాలు చేయకుండానే రోజువారీ కూలి కింద ఆపరేటర్‌ను పెట్టు కొని సొసైటీ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని, హమాలీ, జీపు ఖర్చుల్లో సొమ్మును అదనంగా రాశారని పిఏసీఎస్ మాజీ చైర్మన్ మల్కా ప్రసాదరావు ఆరోపించారు. 51వ విచారణలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సొసైటీ సొమ్మును దుర్వినియోగానికి పాల్ప డుతున్నారనే వ్యాఖ్యలు ఆవాస్తవమని, ప్రతి పైసా, ఖర్చుల పూర్తి వివరాలు ప్రతిరోజు ఆన్లైన్లో నమోదు చేయడం జరు గుతుందని చైర్మన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక 13 మందికి రూ.74 లక్షలు, స్వల్పకాలిక రుణాలు రూ.50 లక్షలు ఇవ్వడం ఇచ్చామన్నారు. జమ ఖర్చుల ఆమోదం, ఆదాయ వ్యయ పట్టిక ఆమోదం, సంఘంలో క్యాష్ కౌంటర్ ఏర్పాటు గురించి, విధుల్లో నుంచి తొల గించిన మాజీ సిఈఓ, కంప్యూటర్ ఆపరేటర్ విధుల్లోకి తీసుకొనుట తదితర అంశాలను సమావేశంలో తీర్మానం చేసి డిసిఓ కు అప్పీల్ చేయటకు నిర్ణయించినట్లుగా సిఈఓ తెలి పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతి రావు, బొమ్మ రమేష్ రెడ్డి, సంగ్గెం రమేష్, రామన్న, సురేష్, రాజేశ్వర్ రావు, రాజమ్మ, సమ్మక్క, సర్వీ నాయక్ పాల్గొన్నారు.