Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 యేండ్లలో చేయనది మూడేళ్ల లోనే అభివృద్ధి చేసి నిరూపించాం
- ఎమ్మెల్యే పెద్దిపై ఆరోపణలో అర్థం లేదు
- బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై టీఆర్ఎస్ ఫైర్
నవతెలంగాణ-నర్సంపేట
భూకబ్జాలు చేస్తే నాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రేవూరి ప్రకాష్ రెడ్డి ఎందుకు అరికట్టలేకపోయారో చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్అండ్బీ గెస్టు హౌజ్లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న రేవూరి హయాంలోనే జాలుబంధం కాల్వ స్థలంపై రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. నాడు రేవూరి, ఆ తర్వాత దొంతి మాధవరెడ్డి కూడా గుడి పనులకు కొబ్బరి కాయ కొట్టినవారే నన్నారు.20 యేండ్ల క్రితం జాలుబంధం కాల్వ స్థలంలో వెంచ ర్లు చేసింది నిజమైతే ఎమ్మెల్యేగా రేవూరి ఎందుకు అడ్డుకో లేదని ప్రశ్నించారు. 15 ఏళ్ల రేవూరి పదవీ కాలంలో చేయని అభివృద్ధి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మూడున్నర యేండ్లలోనే చేసి నిరూపించారని తెలిపారు. నియోజవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతూ క్యాంప్ కార్యాలయంలో అందుబాట్లో ఉంటూ సామాన్యుడు వెళ్లిన స్పందిస్తూ సేవలను అందిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకొంటున్నాడని రేవూరి ఆరోపణలు అర్థరహితమన్నారు. తన పదవీ కాలంలో రేవూరి కమీషన్లు ఎంత తీసుకున్నాడో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కమీషన్లు తీసుకొని ఇక్కడి నుంచి హైదరబాద్ వరకు ఎన్ని అస్తులు సంపాదించారో నిరూపించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తుంది కేవలం అధికార పార్టీకి చెందిన వారే లేరని బీజేపీ, కాంగ్రేస్లోనూ ఉన్నారని తెలిపారు. పట్టణంలో 70 శాతం ప్రభుత్వ అసైండ్ భూములే ఉన్నాయని కొనుగోళ్లు, అమ్మకాలు ఈ మూడేండ్లలోనే మొదలు కాలేదని అది రేవూరి, కాంగ్రేస్ హయాంలోనూ కొనసాగిందని గుర్తు చేశారు. కొందరు వ్యక్తి గతంగా చేసిన తప్పిదాలకు ఎమ్మెల్యేకు అట్టగట్ట డంలో అర్థం లేదన్నారు. తప్పులు చేసిన వారు పార్టీ క్రమ శిక్షణకు గురైతారని చెప్పారు. ఇప్పటికైనా రేవూరి, కాంగ్రేస్ నాయకులు ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెప్పుతారన్నారు. పట్టణంలో గ్రీన్ల్యాండ్లు ఆక్రమణకు గురైయ్యాయని రేవూరి చెప్పడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్ అన్నారు. ఎమ్మె ల్యేపై సత్యదూరమైన ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకట నారాయణ గౌడ్ మాట్లాడుతూ మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా పదవీలో కొనసాగిన రేవూరి హాయంలోని అభివృద్ధికి మూడున్నర యేండ్ల ఎమ్మెల్యే పెద్ది పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. రేవూరి కండ్లు ఉన్న కబోదిలా వ్యవహరించడం సిగ్గుచేటని దుయ్య పట్టారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోకపోతే సహించేదిలేదని స్పష్టం చేశారు. వార్డు కౌన్సిలర్ దార్ల రమా దేవి పట్టణంలో ఉన్న 26 గ్రీన్ ల్యాండ్ల జాబితాను విడుదల చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, మండల శ్రీనివాస్, గోనె యువరాజు, రావుల సతీష్, సారంగం పాల్గొన్నారు.