Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటియుసి నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల జీవన వెంటనే విడు దల చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవనంలో ఏఐటియుసి, అనుబంధ, తెలంగాణ మధ్యాహ్న భోజన పథ కం వర్కర్స్ యూనియన్, జిల్లా, మహాసభ నిర్వహిం చారు. సభకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథ కం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర, వర్కింగ్ ప్రెసిడెంట్, జం పాల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొరిమి సుగుణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ , తెలంగాణ మధ్యా హ్న భోజన పథకంలో గత 22 సంవత్సరాలుగా వంట కార్మికులుగా పనిచేస్తూ, విద్యా ర్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ ,వంట కార్మికులు మా త్రం అర్దాకలతో, అప్పుల బాధతో ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నారు. వంటకు సంబంధించిన ఖర్చులు మొత్తం వంట కార్మికులే భరిస్తూ ,అందుకు పెట్టిన బిల్లులు సకాలంలో అందక, 6, 7 నెలల వరకు పెండింగ్లో ఉం డడం మూలాన, అనేకమైన ఇబ్బందులకు గురవుతు న్నారన్నారు. దీంతోపాటు రూ. 1000 గౌరవ వేతనంతో పని చేస్తూ చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. పెంచిన వేతనాలకు సంబంధించిన, జీవోను వెంటనే విడుదల చేసి, వేతనాలు కూడా ప్రకటించిన నాటి నుండే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే సం వత్సరానికి రెండు జతలు యూనిఫాం అందించాలని, దాంతోపాటు మూడువేల వేతనం అనేది ప్రస్తుత రోజులకు ఏమాత్రం సరిపోవడం లేనందున కనీసం 9000 రూపా యలైనా అందించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలన్నీ పరిష్కరించుకోవడం కోసం జిల్లాలోని మధ్యాహ్న భోజన వంట కార్మికులు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది ఉద్యమాలను నిర్వహించి హక్కుల సాధనకు గాను త్వరలో రాష్ట్రంలో జరగబోయే తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మహాసభలతో పాటు ఏఐటీయూసీ మహాసభలను కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సోతుకు ప్రవీణ్, శ్రీకాంత్, నబి, పెంట రవి, పద్మ, శ్రీదేవి, వివిధ మండలాల సంబం ధించిన మధ్యాహ్న భోజనం కార్మికులు సుమారు 100 మంది పాల్గొన్నారు.