Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో పక్కా ప్రణాళికలతో ఆయిల్ పామ్ మొక్కల పెంపకం లక్ష్యం సాధించాలని దానికనుగుణంగా క్షేత్రస్థా యిలో అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో ఉద్యాన శాఖ అధికారులు, సువెన్ ఆగ్రో ఇండిస్టీస్, డ్రిప్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లతో ఆయిల్ పామ్ సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 2022-23 సంవత్సరమునకు జిల్లాకు 6615 ఎకరాల ఆయిల్ పా మ్ సాగు లక్ష్యం కేటాయించటం జరిగిందని, సువే న్ ఆయి ల్ పామ్ కంపెనీ ద్వారా మొక్కల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో రైతులను గుర్తిం చాలని, మొక్కలను, పరికరాలను అందించాలని, ఆయిల్ పామ్ సాగులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేం దుకు ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.ఇప్పటి వరకు జిల్లాలో 333 మంది రైతులకు గాను 1146 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం మంజూరు చేయగా 267 మంది రైతులకు గాను 846 ఎక రాల్లో ఆయిల్ ప్లమ్ ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగిందని అధికారులు వివరించారు. ఉద్యాన శాఖ అధికారులు మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారుల సహ కారంతో ఆయిల్ పామ్ సాగు విస్తరణకై లబ్దిదారులను గుర్తించాలని, ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తిగల రైతుల పొలాలను వెంటనే సర్వే చేసి, పరిపాలనాపరమైన అనుమ తులు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన, శిక్షణా కార్యక్రమాల కోసం రైతు వేది కలను ఉపయోగించాలని, సాగు పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో సమాచారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి సంజీవరావు, సువేన్ ఆగ్రో ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎం డి గౌతమ్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.