Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వీరయ్య
- జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో జరుగుతున్న మతోన్మాద దాడులను అరి కట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్య దర్శి ఎస్ వీరయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి 1000 క్వార్టర్ల సమీపంలో ఉన్నటువంటి సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యకర్తల రాజ కీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దే శంలో మతోన్మాద దాడులు విపరీతంగా పెరిగిపో తున్నాయని ఉన్న త విద్యలో నిధులు కరువైపోయాయని ప్రభుత్వ విద్యా రంగాన్ని మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలి చేస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్స్ లేక డిపార్ట్మెంట్లు మూత పడుతున్న ప్ప టికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుతుందని వారు వాపోయారు. అదేవిధంగా మొత్తం కూడా మతం మూఢ నమ్మకాలం ప్రేరేపించే విధంగా వాస్తవాలను కప్పిపుచ్చు కుంటూ కట్టు కథలను విద్యారంగంలో చెప్పించడం అనేది విద్యార్థుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు లేకుండా చేయడం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని వారన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్ట్లు భర్తీ చేయకుండా పెరిగిన ధరల కను గుణంగా మెస్సు కాస్మొటిక్ చార్జీలు పెంచకుండా పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి చూపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థులందరూ కూ డా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల హక్కులకై భవిష్యత్తులో ఉద్యోగించాలని విద్య అనేది ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అం దించడం అనేది రాజ్యాంగంలో హక్కు అని వారు అన్నారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్క రించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థి నాయకులుగా ప్రతి విద్యార్థి తమ విద్య రంగంలో నెలకొన్న సమస్యల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం భవిష్యత్తు పోరాటాలు ఉండాలని సూచించారు. కార్య క్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, తాళ్ల నాగరాజు, జిల్లా నాయకులు అడపా సంతోష్ , దమేర కిరణ్,రాజు, బొడ్డు కిషోర్, బోడ్డు స్మరన్ , సంపత్ రెడ్డి,తదితరుల పాల్గొన్నారు.