Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్
- ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలే బుద్ది చెప్తారు
- జాతీయ రహదారిపై టిఆర్ఎస్ భారీ ర్యాలీ
నవతెలంగాణ-ములుగు
చేతనైతే తెలంగాణ విభజన చట్టంలోని హామీలను పక్కాగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ములుగు జాతీయ రహదారిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వాఖ్యలకు వ్యతిరేకంగా జాతీయ రహాదారిపై టిఆర్ఎస్ అధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, మాజీ ఎంపీ సీతీరాంనాయక్తో కలిసి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలను జగదీశ్వర్ తప్పుబట్టారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపు చేయలేదనడం సిగ్గుచేటన్నారు. బిజెపి నాయకులు ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారని ఇలాంటి చౌక బారు వాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని చూస్తే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని, ఒక జాతీయ స్థాయి మంత్రిగా ఉంటూ అబద్దాలు ఆడటం సిగ్గు చేటని, ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు తిరిగి పునరావతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. బయ్యారంలో ఉక్కు కర్మగారాన్ని ఏర్పాటు చేయడం కోసం చాతనైతే కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ములుగు, వెంకటా పూర్, ఏటూరునాగారం మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, రమణారెడ్డి, సునిల్, జడ్పీటిసి సకినాల భవాని, గోవింద రావుపేట ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ మాడుగుల రమేష్, ఎంపిటిసిల ఫోరం జిల్లాఅధ్యక్షుడు విజరు, ములు గు టౌన్ అధ్యక్షుడు విజరు, ములుగు మండల యువజన విభాగం నాయకుడు సాగర్, బుర్ర సమ్మయ్య మల్లారెడ్డి, మురళీ, మోహన్,సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శంభునిపేట జంక్షన్లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్ధన్, టిఆర్ఎస్ నేతలు పోశాల స్వామి, బోగి సురేష్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు, ఈ సందర్బంగా జనార్ధన్ మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం తెలంగాణాలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశం స్పష్టంగా ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కు అన్యాయం చేసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. వెంటనే కిషన్ రెడ్డి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చు ని కేంద్రమే భరించి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చెయ్యాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సంగరబోయిన విజరు, ఎండి ఉల్ఫత్, ఈదుల రమేష్, పస్తాం బిక్షపతి, బజ్జురి రవి, గుండు సదానందం తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : ఉక్కు పరిశ్రమ కేంద్రం ఇచ్చిన భిక్ష కాదని అది తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్ అన్నారు. మండల కేంద్రం లో కేంద్ర ప్రభుత్వం మరొకసారి ప్రదర్శించిన మొండి వైఖరికి నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతపట్ల మాలతి,రైతు బంధు సమన్వయ కమిటీ జిల్లా నాయకులు సోమేశ్వర రావు,మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్,నాయకులు ఏర్పుల శ్రీనివాస్,రాపాక నాగయ్య,చింతల శ్రీనివాస్, చల్లా వెంకన్న, బరిగేల విజయ,బోట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట తప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాశిబుగ్గ చౌరస్తాలో టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా 19,20,21,26వ డివి జన్ల కార్పొరేటర్లు ఓని స్వర్ణలత భాస్కర్, గుండేటి నరేంద్ర కుమార్, ఎండి పూరాన్, బాల్నే సురేష్‌లు మాట్లాడుతూ బిజ ెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి అధికా రంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వకపోగా ఇప్పు డు తాము ఇవ్వలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ తేలేని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, నాయకులు దుబ్బ శ్రీనివాస్, ఈటల ఉమా మహేందర్, బొట్ల సదా నం దం, వేముల నాగరాజు, ఎండి ఇక్బాల్, గణిపాక సుధాకర్, దేవర ప్రసాద్, రేపూడి కిరణ్, ముత్తయ్య, వంశీ, భాస్కర్, చందు, రమేష్, సాంబయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.