Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ గురుకుల పాఠశాలలో వంట సిబ్బందికి శిక్షణ..
నవతెలంగాణ-మట్టెవాడ
మంచి రుచి, సుచికరమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జీవరత్నం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వసు రాము,వంట చేసే సిబ్బందికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆహార కలుషితం నివారణ చర్య లు సిబ్బంది బాధ్యత అనే అంశంపై వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి సూచనల మేరకు అవగాహనతో పాటు శిక్షణ తరగ తులను రంగసాయిపేట లోని జక్కలొద్దీ మైనారిటీ గురు కుల పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. మైనారిటీ బాలుర గురుకుల ప్రిన్సిపాల్, మాస్టర్ ట్రైనర్ గన్నబోయిన బిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు గిరిజన, కస్తూర్బా, జ్యోతిర్బా పూలే , మైనా రిటీ, మోడల్ స్కూల్,వివిధ సంక్షేమ గురుకులాలో పనిచేస్తున్న వంట సిబ్బంది హెడ్ కుక్, సహాయ సిబ్బందికి వంట చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పిల్లలకు అందించాల్సిన నాణ్యత రుచికరమైన భోజనం పై పలు సూచనల తో పాటు శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు వ్యక్తిగత పరిశుభ్రత బియ్యం నాణ్యత ఆహార సరుకుల నాణ్యత వంట నాణ్యత ఆహార కలుషితం నివారణ ఆరోగ్య సంరక్షణ పై సవివరంగా వివరించారు. మాస్టర్ ట్రైనర్ గురుకుల హెచ్ఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైనారిటీ గురుకు లాల కార్యదర్శి షఫీల్ల, ప్రధానోపాధ్యాయులు తాళ్ల నీలి మాదేవి, వాస్కుల రాజు దాసరి కృష్ణమూర్తి, బైరి మాధవి, తదితరులు పాల్గొన్నారు.