Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యంసిపిఐయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదగోని రవి
నవతెలంగాణ-మట్టెవాడ
బీహార్ రాష్ట్రంలో నవంబర్ 12 నుండి 15వ తేదీల్లో నిర్వహించే యంసిపిఐయు 5వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని యంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. మంగళవారం అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్లో సంగతి మల్లికార్జున్ అధ్యక్ష తన ఎంసిపిఐయు కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లా డుతూ మాట్లాడుతూ యంసిపిఐయు 5 వ జాతీయ మహా సభలలో 13 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ఈ మహా సభలకు జాతీయ వ్యాప్తంగా ఉన్న వామపక్ష, సామాజిక నేతలను ఆహ్వానిస్తున్నామని దేశం లో వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యత లక్ష్యంగా ఈ మహాసభలను నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం చేసిందని తెలిపారు. కేంద్రం లోని బిజెపి మతోన్మాద, పాసిజానికి పాల్ప డుతున్న తీరు, సంఫ్‌ు పరివారం, ఆర్ యస్ యస్, యొక్క ఆదేశాలతో పాలిస్తున్న తీరు సహేతుకంగా లేదు అని అన్నారు. బిజెపి అత్యంత దుర్మార్గమైన సంస్కరణలు చేస్తూ మతవిభజన రాజకీయాలు చేస్తున్నారని, విపక్షాలను బలహీన పరిచే విధంగా ఈడి, సిబిఐ, రక్షణ రంగం, కోర్టులు, అన్ని ప్రభుత్వ వ్యవస్థ లను నిర్వీర్యం చేస్తున్నారనీ మండిపడ్డారు. ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్దారపు రమేష్, జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం నాగార్జున, కన్నం వెంకన్న, కుసుంబ బాబురావు, మంద రవి, నర్ర ప్రతాప్, కనకం సంధ్య, మహ్మ ద్ రాజా సాహెబ్, సుంచు జగదీశ్వర్, గటికె జమున, మహ్మ ద్ ఇస్మాయిల్, మల్లికార్జున్, అరుణ్ నాయక్, సీతారా ములు, ప్రభాకర్, రమేష్, కుమారస్వామి పాల్గొన్నారు.