Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెసిఆర్ పాలనలో అధిక సంఖ్యలో గురుకులాల ఏర్పాటు
- విద్యా వ్యవస్థకు అధిక నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- రాయపర్తి గురుకుల అభివృద్ధికి మంత్రి ఎర్రబెల్లి కీలకం
- వరంగల్ ఎంపీ దయాకర్
నవతెలంగాణ-రాయపర్తి
రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిని మించి గురుకుల విద్యా ఆలయాలు అభివృద్ధి చెందాయని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. మండల కేంద్రం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల /కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించగా మంగళవారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుం దని దానిని గుర్తించి వెలికి తీసినప్పుడే ప్రపంచం గుర్తి స్తుందని పేర్కొన్నారు. క్రీడలతో జీవితంలో ఉన్నత శిఖరా లను అధిరోహించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యా ర్థులకు గురుకులాలు ఒక వరంగా లభించాలని ఉపోద్ఘా టించారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధిక సంఖ్యలో గురుకు లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. విద్య వ్యవస్థకు అధిక నిధులు కేటాయిస్తూ మన ఊరు మనబడి వంటి కార్యక్రమాలను రూపొందించి ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. రాయపర్తి గురుకుల పాఠశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక చెరువుతో సొంత డబ్బులతో అభివృద్ధి తెలిపారు. మంత్రి సహకారంతో గురు కుల పాఠశాల ఉన్నత స్థాయిలో నిలిచింది అని కొనియా డారు. గురుకులలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కషి, దీక్ష ఉన్నతమైంది అని పొగిడారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఆర్సిఓ విద్యారాణి, సర్పంచ్ గారె నర్సయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, ఎంపీటీసీ ఐత రాంచందర్, ప్రిన్సిపాల్ ఉమ మహే శ్వర్, తదితరులు పాల్గొన్నారు.