Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి
నవతెలంగాణ-వరంగల్
కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టర్ కార్యా లయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతినీ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఎం ఎల్సి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ప్రజా ప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ భావితరాలకి స్ఫూర్తి దాయకమన్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 30 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసే క్రమంలో నియోజకవర్గ ప్రజలను ప్రజాప్రతినిధులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ అనేక అభివృ ద్ధి కార్యక్రమాల చేపట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముం దుకు పోతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవె న్యూ శ్రీవత్సవ కోట అదనపు కలెక్టర్ హరి సింగ్, బీసీ సంక్షేమ అధి కారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్ సంబంధిత బీసీ సంక్షేమ అధి కారులు పద్మశాలి సంఘ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట : తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలను వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనం గా నిర్వహించారు. చైర్ పర్సన్ ఆంగోత్ అరుణ బాపూజీ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ కొమాండ్ల ఎలెందర్రెడ్డి, కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, కొండేటి అనిత , భూక్య సరిత, రవీందర్, రామకృష్ణ, కో-ఆ ప్షన్ సభ్యులు సోమయ్య, అజిమ్, అన్వర్, అధికారులు, పాల్గొన్నారు
భవిష్యత్ తరాలకు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపుజీ
ములుగు : స్వతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శమని కలెక్టర్ యస్ క్రిష్ణ అదిత్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో లక్ష్మణ్ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు. సమా జంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ గత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచా రన్నారు. అదనపు కలెక్టర్ వైవి గణేష్, సిపిఓ ప్రకాష్, కలెక్టరేట్ ఏవో విజయ భాస్కర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మలి విడత తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చుక్కాని వంటి వారని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. జెడ్పీ కార్యాలయంలో కార్యాలయ డిప్యూటీ సిఇఓ, కార్యాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపి సీతరాం నాయక్, ములుగు, వెంకటాపూర్, ఏటూరునాగారం మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, రమణారెడ్డి, సునిల్, ములుగు జడ్పీటిసి సకినాల భవాని, గోవిందరావుపేట ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ మాడుగుల రమేష్, ఎంపిటిసిల ఫోరం జిల్లాఅధ్యక్షుడు విజరు, ములుగు టౌన్ అధ్యక్షుడు విజరు, ములుగు మండల యువజన విభాగం నాయకుడు సాగర్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వెనుకబడిన తరగతుల అబివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అథిదిగా జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ హాజరై మాట్లాడారు. కొండా లక్ష్మన్ బాపుజీ నిఖార్సయిన తెలంగాణ వాది, తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త,అని కొనియాడారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి లక్ష్మన్, డిపి జనార్ధన్ అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీదర్ ,ప్రధాన కార్యదర్శి చిప్ప అశోక్ ,జిల్లా అధ్యక్షులు ఎల్ల మధు సుధన్ , మొగొళ్ల బద్రయ్య, బిసిసంఘ కర్యధర్శికులు,హేమాద్రి సంఘ నాయకులు , బిక్షపతి గౌడ సంఘ నాయకులు, చేనేత సంఘ జిల్లా నాయకులు రేల విజరు, సారయ్య, బిసి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పీడిత ప్రజల పక్షపాతి,బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శమని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్ దారులు, తదితరులు ఉన్నారు
మల్హర్రావు : స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ ఆది గురువు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా నోడల్ అధికారి, తాడిచర్ల జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ దేవరాజు ఆదేశాలతో కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యాపక బృందం విద్యార్థులతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం జరి గిన కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లా డుతూ ఆశయం, ఆకాంక్ష, ఆవేశం, ఉద్యమం ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రో గ్రాం అధికారి రవీందర్, అధ్యాపకులు కళాశాల సిబ్బంది. పాల్గొన్నారు.
పర్వతగిరి : స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సర్పంచ్ చింతపట్ల మాలతి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాడుగుల రాజు, ఉపసర్పంచ్ రంగు జనార్ధన్, వార్డు సభ్యులు కంటేం ఏకాంతం, చింతపట్ల కవిత, గుగులోతు వీరన్న, పుల్లూరి కష్ణవేణి, నూనె ఏకాంతం, నీరటి బుచ్చమ్మ,నాగుల కుమారస్వామి, బొట్ల పద్మ, చిన్న పెళ్లి కుమార్, చిధురు రజిత, అక్క ల రేణుక, బీక్య రాజు పాల్గొన్నారు. తహసీల్ కార్యాలయంలో తహ సిల్దార్ అజ్మీరా కోమి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ తహసీల్దార్ వినోద్ కుమార్, ఆర్ఐ మంద భారతి, పాల్గొన్నారు.
మహదేవపూర్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలం గాణ అభ్యుదయ భావాలు కలిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దామని ఎంపీపీ బన్సోడ రాణి భారు రామా రావు అన్నారు. మంగళవారం లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి ఉత్సవాలను మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావానికి లక్ష్మణ్ బాపూజీ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. మూడు దశల్లో అనేక పోరాటాలు చేసిన కొండా లక్ష్మణ్ స్ఫూర్తితో ముందడుగు వేద్దామని పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్, సబ్ డివిజన్ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాదె రమేష్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర, జయంతి ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలిపారు. ఈ సంద ర్భంగా జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా అవార్డు పొందిన మండల కేంద్రానికి చెందిన రాజును శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ గుప్తా, తహసిల్దార్ శ్రీనివాస్,.ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల, ఆసుపత్రి మెడ ికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్, డాక్టర్ స్వాతి, ఎం పి ఓ ప్రసాద్, మండల పద్మశాలి సంఘం కన్వీనర్ దశరథం, పంతకాని సమ్మయ్య, శ్రీనివాస్, పినగాని రమేష్, డాక్టర్ సతీష్, జయంత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ శ్రీపతిబాపు అధ్యక్షతన కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,ఎంపీపీ బి రాణి బాయి, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, పంచాయతీ పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య, తహశీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్ నాయక్, శ్రీ షిరిడీసాయిబాబా దేవస్థాన ఛైర్మన్ మెరుగు లక్ష్మణ్, పాల్గొన్నారు.
భూపాలపల్లి : తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు. మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు అని తెలిపారు. కార్య క్రమంలో మునిసిపల్ కమిషనర్ పి.అవినాష్ ,కౌన్సిలర్లు ముం జాల రవీందర్ గౌడ్, జక్కం రవి కుమార్, బద్ది సమ్మయ్య, పాను గంటి హారిక శ్రీనివాస్, మెప్మా డిఎంసి రాజేశ్వరి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మొగుళ్ళ పల్లి : మండల కేంద్రంలో తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 104 జయంతి వేడుకలను సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసంతెలంగాణ సాధన కోసం తన జీవితమంతా పోరాడిన గొప్ప నేత అన్నారు. కార్యక్రమంలో విజేందర్, ప్రసాద్, నబీ, రవి,సతీష్, రాజు,రమేష్, రాజేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు అధ్యక్షతన కొండ లక్ష్మన్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమన వాణి, ఎంపీవో పర్వీన్ కైసర్, సీనియర్ అసిస్టెం ట్ పధ్వీరాజ్, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ భాష బోయిన ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : ఎల్బీనగర్ లో పద్మశాలి ట్రస్ట్ అధ్యక్షుడు సుంకన పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాపూజీ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు ఆకెన వెంకటేశ్వర్లు, గాదె ప్రభాకర్, బింగి మహేష్, మార్గం ఎల్లయ్య, కోమాకుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో, స్థానిక పద్మశాలి సంఘం స్థలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా పద్మశాలి కులస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై నార్లపురం రాజారామ్, సర్పంచ్ నాన్న బోయిన రాజారాం హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జన్ను జయరావు, గ్రామ అభివద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పద్మశాలి మండల అధ్యక్షుడు భోగ భద్రయ్య, గ్రామ అధ్యక్షుడు ఉడుత రమేష్, పోపా సంగం అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉడుత రాజేందర్, పరికి కోర్నల్, దేవులపల్లి శ్రీనివాస్, ఉడుత రాజు, బొద్దుల దశరథం, ఉడుత వీరన్న, సామల లక్ష్మీనారాయణ, బొద్దుల నరసయ్య, వేముల రామ్మూర్తి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.