Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హనుమకొండ
తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను సాధించలేని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయ కుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాద్యం కాదని, దానివల్ల ప్రయోజనం లేదని చెప్పడం మూర్ఖత్వం అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా ఓవర్ హాలింగ్ సెంటర్ వస్తుందని చెప్పడం అన్యాయన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, వరంగల్ లో సైనిక్ స్కూల్ కోసం కేంద్రం నిధులను కేటాయించకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్పడం మోసం చేయడమేనని అన్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా నాయకులు మద్దెల ఎల్లేష్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, ఉట్కూరీ రాములు తదితరులు పాల్గొన్నారు.