Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఐనవోలు
బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేసి పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం వెంకటా పురం గ్రామంలో మహిళ పార్టీ సభ్యులకు. పార్టీ విశిష్టత బిజెపి మతోన్మాద ప్రమాదం అనే అంశంపై స్టడీసర్కిల్ మాదాసు పోచమ్మ అధ్యక్షతన నిర్వహించారు. తమ పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందన్నారు. దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని ఆచరిస్తూ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. దళిత మైనార్టీల పై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అత్యా చారాలు పెరిగిపోతున్నాయన్నారు. మండలం లో కొంతమంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దర్జాగా సాగు చేస్తున్నారని, వారి పట్ల రెవెన్యూ అదికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆరోపిం చారు. కార్యక్రమంలో బొమ్మ కంటి యాకయ్య, మాదాసు, శరణ్య,రాధిక,ఫాతిమా, సజన, ఎల్లమ్మ, పద్మ, బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.