Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈనెల 29న స్థానిక లైన్స్ క్లబ్ సేవా భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట కమిటీ పిలుపునిచ్చింంది. సంబంధిత ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక విశ్రాంతి భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా పోరాట కమిటీ కన్వీనర్ తమ్మెర విశ్వేశ్వరరావు, కో కన్వీనర్లు కొత్తపల్లి రవి, బొల్లం అశోక్ మాట్లా డుతూ... తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలన్నా రు. మార్చురుని వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఎస్టీఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. తొర్రూరు పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు ఎందుకు ఆడిపోయాయ యని ప్రశ్నించారు. తదితర సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముంజంపల్లి వీరన్న, గట్టు శ్రీమన్నారాయణ, బందు మహేందర్, దొనక దర్గయ్య, మాలోతు సురేష్, జమ్ముల శీను తదితరులు పాల్గొన్నారు.