Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ దంపతుల స్పౌజ్ ఆవేదన సభ
నవతెలంగాణ-సుబేదారి
ముఖ్యమంత్రి మాటే ముద్దు దంపతులు విడిగా వద్దు అనే నినాదంతో దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని వరంగల్ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఉపాధ్యాయ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ దంపతులు వారి పిల్లలు తల్లిదండ్రులు ఆవేదన సభలో పాల్గొని తమ గోడును ప్రభుత్వానికి విన్నవించారు. 9నెలలుగా ఉపాధ్యాయ కుటుంబాలు అనుభవిస్తున్న నరకయాతను బతుకమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉపాధ్యాయు నిలు బతుకమ్మలాడారు. వరంగల్ డీఈఓ కార్యాల యం లో ప్రారంభమైన 13 జిల్లాల ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ మైదానం వరకు సాగింది. ఉపాధ్యాయులైన దంపతులు ఒకే చోట విధుల్లో ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మాటలను అమలు చేయడంలో అధికారుల స్థాయిలో జరిగిన పొరపాటుకు తాము నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. ఉపా ధ్యాయ దంపతుల బదిలీలు నిలిచిపోవడంతో 13 జిల్లాల్లో సుమారు 1800 కుటుంబాలు చిన్నాభిన్న మయ్యాయన్నారు. బతుకమ్మ సంబరాలు ముగిసే లోపు తమ సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పౌజ్ ఫోరమ్ సమన్వ యకర్తలు వివేక్, కష్ణ ,ఖదీరు, చంద్రశేఖర్ రెడ్డి వందలాదిమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.