Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ చూపు తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. మంగళ వారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ అజీజ్‌ఖాన్‌తో పాల్గొని దాస్యం మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కుదరదని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాదని, ములుగు గిరిజన యూనివర్సిటీ రాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం మూర్ఖత్వం అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం లో పొందుపర్చిన అంశాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి నెరవేర్చలేద న్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నేతత్వంలో తామంతా రాజీనామాలు చేస్తే కిషన్ రెడ్డి మాత్రం విదేశాలకు వెళ్లాడన్నారు. పార్లమెంటుకు అం బేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో పత్తలేకుండా పోయాడని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలిపోతోందని, బీజేపీ ి నాయకులందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, ములుగు యూనివర్సిటీని సాధించుకుం టామని తెలిపారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్ట హామీలను నెరవేర్చాలన్నారు. మునుగోడు గాని ఎక్కడైనా గాని ఎన్నికలు జరిగినా బీజేపీ, కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రలు చేయకుండా బండి సంజరు బౌన్సర్ల తోని తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేస్తున్నర న్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ,ఎమ్మెల్సీ బండ ప్రకాష్, గ్రంధాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్ పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ
ఎక్సైజ్ కాలనీలోనీ కేసీఆర్ పార్కులో 51, 59, 60 డివిజన్ ఆడపడుచులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినేభాస్కర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కూడా చైర్మన్ సుందర్ రాజ్ , గ్రంథాలయ చైర్మన్ అజిజ్ ఖాన్,59 డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత, 60 డివిజన్ కార్పొరేటర్ దాస్యం అబినవ్ భాస్కర్,51 డివిజన్ నాయకులు పాల్గొన్నారు.