Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాల గణపురం
మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆకస్మి కంగా తనిఖీ చేశారు కేంద్ర బందం పర్యటన భాగంగా మండల పరి ఉపాధి హామీ పనులను గ్రామపంచాయతీ రికార్డులను సందర్శించి పరిశీలించారు. ఈ నెలలో కేంద్ర బందం పర్యటన ఉన్నందున గ్రామపంచాయతీకి సంబం ధించిన ఏడు రికార్డులను అందుబాటులో ఉంచాలని అన్నాఉ. ఉపాధి హామీ పనులకు సంబంధించిన పలు రికార్డులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవా లని కోరారు. మండల పరిధిలో ఉపాధి హామీ పనులు మందకొండ సాగుతున్నాయని వేగాన్ని పెంచాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లికార్జున్, తాసిల్దార్ అంజయ్య పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.