Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శమని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, తహసీల్ధార్ కార్యాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది తో కలిసి బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో నాలుగవ రోజు సందర్భంగా నానబియ్యం బతుకమ్మ వేడుకల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆటపాటతో కోలాట మాడారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్ తో కలిసి ఎంపిపి నాగిరెడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ ఆటపాట ప్రపంచ స్థాయికి చేరిందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం లో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య, ఏపీవో అంబాల మంజుల, సర్పంచ్ కత్తి సైదులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బంది, ప్రజాప్రతిని ధులు పాల్గొన్నారు.