Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని ఓబులాపూర్ గ్రామంలోఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు, బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం చేపట్టారు. స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాగా గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమావేశం ఎదుట నిరసన తెలిపి ఎమ్మెల్యేను నిలదీశారు. దళితబంధు విషయంలో ఎమ్మెల్యే అనుచరులు చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నవారికి దళిత బంధు ఇస్తున్నారని నిలదీశారు. అర్హులైన దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక పరిస్థితిలో ఉద్రిక్త వాతా వరణం నెలకొనడంతో సమావేశం వాయిదా వేసి పోలీసుల సమక్షంలో సమావేశాన్ని ముగించారు.