Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిల్పూర్ వైస్ ఎంపీపీ భూక్య సరిత నర్సింహ
నవతెలంగాణ - స్టేషన్ఘనపూర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే పండుగలకు గుర్తింపు లభించిందని సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారని చిల్పూర్ ఎంపీపీ భూక్య సరితనర్సింహ అన్నారు. బుధవారం మండలంలోని ఫతేపూర్ సర్పంచ్ బానోత్ రూప్లా నాయక్, క్రిష్ణాజి గూడెంలో సర్పంచ్ పుట్ట అంజనీ దేవి, ఎంపిటిసి సాదం నర్సింహులు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కతికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం, రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీ రంగారెడ్డి రాంబాబు వార్డు సభ్యులు లక్ష్మి బాలు బుజ్జమ్మ పద్మ కడియం యువసేన అధ్యక్షులు భూక్య సంజీవ, వేముల వెంకటేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.