Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
మండలంలోని ప్రేమ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధి మామిడి గూడెం లో ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే నిర్వహించారు. బుధవారం పోడు దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి అటవీ భూమి. సరిహద్దులను గుర్తించారు. సాగులో ఉన్న రైతులను అర్హులుగా గుర్తించేందుకు సర్వే చేస్తున్నామని నోడల్ ఆఫీసర్ ఎస్ సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్. జాటోత్ రమ్య వంశీ నాయక్, జెడ్పిటిసి లింగ మల్ల శారద దుర్గయ్య, మహాముత్తారం తాసిల్దార్ సమ్మయ్య, ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ రైట్స్ కమిటీ గ్రామ చైర్మన్ ఎల్ ఆర్ నాయక్ , గ్రామ కార్యదర్శి అశోక్, రైతులు పాల్గొన్నారు.
రెడ్డిపల్లిలో అవగాహన సదస్సు
మండలం రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ అజ్మీర విమల ఫుల్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ఫారెస్ట్ రైట్స్ కమిటీ కి అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తొలేం అనిత శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదరి, గౌస్ ద్దీన్, పోడు రైతులు పాల్గొన్నారు.