Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మహనీయుల స్ఫూర్తితో పుట్ట మధు గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు జక్కు రాకేష్, యువ చైతన్య యాత్ర ఇన్చార్జి భూపెల్లి రాజు, కన్వీనర్ బొమ్మగాని అనిల్ అన్నారు. యువ చైతన్య యాత్ర ద్వారా మంథని ఎమ్మెల్యే గా పుట్ట మధు పరిపాలించిన నాలుగు సంవత్సరాల కాలంలో చేసిన అభివద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ 30 ఏండ్లుగా మంథని ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కపటనాటకాలను ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు. 30 ఏళ్లు మంథని నియోజకవర్గాన్ని పరిపాలించిన బ్రాహ్మణిజానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం 2014లో మంథని ఎమ్మెల్యేగా ఒక బహుజన బిడ్డ గెలిస్తే జీర్ణించు కోలేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్లుగా ఒక కసాయి బ్రాహ్మణ కుటుంబం చేతిలో మంథని నియోజకవర్గం బందీగా ఉందని, బహుజన బిడ్డ పుట్ట మధు తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తేనే మంథని నియోజకవర్గానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని భూపాలపల్లి జిల్లా యువజన నాయకులు జక్కు రాకేశ్, భుపెళ్లి రాజు, కన్వీనర్ బొమ్మగాని అనిల్ అన్నారు. కమాన్పూర్ మండలంలో ప్రారంభమైన యువ చైతన్య యాత్ర మంథని మండలం సోమనపల్లి నుండి మల్హర్ మండలంలోని కొయ్యూరు గ్రామంలోకి ప్రవేశించింది. యువ చైతన్య యాత్ర నాయకులకు మల్హర్ టిఆర్ఎస్ పార్టీ విభాగం, మండల తెరాస యూత్ విభాగం, కొయ్యూరు యూత్ విభాగం నాయకులు నాగులమ్మ క్రాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి, ఏగోళపు శంకర్ గౌడ్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు గోనె శ్రీనివాసరావు, యూత్ మండలాధ్యక్షుడు జగరి హరీశ్, కో ఆప్షన్ అయూబ్ ఖాన్, ఎస్సి సెల్ అధ్యక్షుడు బుడిది సాధానందం, సోషల్ మీడియా ఇంచార్జ్ అక్కినవేని సుమన్, నాయకులు కోట రవి, వాల యాదగిరి రావు, ఎక్కేటి అనంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.