Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
బతుకమ్మ చీరలు పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ కానుక అని జెడ్పీటీసీ గొర్రె సాగర్ తెలిపారు. మండలంలోని ముచినిపర్తి, గుంటూరుపల్లి గ్రామాల్లో మహిళలకు బుధవారం ఆయన బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునేందుకు గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. బతుకమ్మ చీరలను ఆడపడుచులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, మహిళలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.