Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రేగొండ
ఎన్నో ఏళ్లుగా కష్టపడి నెహ్రూ ప్రభుత్వ కాలం నుండి ఆస్తులను కూడా పెడితే కేంద్రంలో ఉన్న ప్రస్తుత బీజేపీ పార్టీ ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేస్తూ అమ్ముకుంటున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. బుధవారం మండలంలోని రాయపల్లి, దామన్నపేట, దామరంచపల్లి, చిన్నకోడేపక, విజయపల్లి, రాజక్కపల్లి గ్రామాల్లో మహిలలకు బతుకమ్మ చీరలు, లబ్దిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమనీకి ముఖ్య అతిథిగా భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై లబ్ధి దారులకు ఆసరా పెన్షన్ కార్డులు,బతుకమ్మ చిరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్ర అభివద్ధికి పాల్పడుతుందని అన్నారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నామని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరే సారే ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులను నిలిపివేసిందని అన్నారు. లేనిపోని ఆరోపణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని పై నిందలు వేస్తుందని అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వం ఆస్తులను అన్నిటిని ప్రవేట్ పరం చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు హింగే మహేందర్, పీఏసీఎస్ చైర్మెన్ నడిపెల్లి విజ్ఞాన్‌రావు, జెడ్పీ కొప్షన్ సభ్యుడు రహీమ్, మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దాసరి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు నడిపెల్లి శ్రీనివాస్‌రావు, జూపాక నీల నీలాంబ్రం, గుండు బుచ్చమ్మ,. భాగ్యలక్ష్మి అశోక్, కుంట తిరుపతి, ఆంబల చందు, పబ్బా శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు ఐయిలి శ్రీధర్ గౌడ్, కేశిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.