Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని కాచనపల్లీ గ్రామంకు చెందిన బొమ్మెల హరి ఇటీవల అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నందున హాస్పిటల్ వైద్య ఖర్చుల సహాయార్థం మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 2,50,000 విలువైన చెక్కును బుధవారం మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ బిందు నాయక్ అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్మ వారి కళ్యాణ మండపంలో జరిగిన టీిఆర్ఎస్ నాయకులు నందగిరి భద్రయ్య మనుమరాలు స్వాతి - హనీష్ కుమార్ కుమార్తె మాన్య శ్రీ నామకరణం, అన్నప్రాసన వేడుకలకు హాజరై ఆశీర్వదించారు. ఆమె వెంట సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సర్పంచ్ ముడిగ వజ్జయ్య, ఉప సర్పంచ్ బొమ్మేల పాండు రాజు, టిఆర్ఎస్ నాయకులు సొమ్ల నాయక్, పటేల్ సాంబ శివరావు, బొల్లి మల్సూరు, సులోచన, బానోత్ మంత్రియా, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, నాయకులు రాసమల్ల నాగేశ్వర్ రావు, తమ్మిశెట్టి వెంకటపతి, బొబ్బిలి కిరణ్, సుమన్, బిక్కి వెంకట నారాయణ, తదితరులు ఉన్నారు.