Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్
- లీడర్ సూర్ణపు సోమయ్య వినతి
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలో దళితబంధు వార్డుల వారీగా కోటా కాకుండా దళితులు అధిక బాగంలో నివాసముండే ప్రాంతాలలో ఎక్కువ లబ్ది దారులను ఎంపిక చేయాలని, అలా కాకుండా వార్డుల వారీగా కోట లు కేటాయిస్తే దళితులు అధికంగా ఉండే ప్రాంతాల వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్ణపు సోమయ్య అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. లబ్దిదారుల ఎంపికలో వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేమన్నారు. దళితులు ఎక్కువగా ఉండే కాలనీల్లో ఎక్కువమందికి దళితబంధు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ పట్టణ శివారు కాలనీల్లో దళితులు ఎక్కువ సంఖ్యలో కూలీనాలీ చేసుకుని పొట్ట పోసుకుంటున్నారని అన్నారు. ఎంతోమంది సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని అన్నారు. వారందరికీ దళిత బంధు వర్తిం పచేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై పరిశీలన చేసి ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.