Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
- మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర
నవతెలంగాణ-లింగాలఘనపురం
జీడికల్ నుండి జనగామ వరకు డబల్ లైన్ రోడ్డు వేసి వాహనదారుల, ప్రజల ప్రాణాలను రక్షించాలని, మండల ప్రజాసమస్యలు పరిష్కారం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి కోరారు. బుధవారం జీడికల్ నుండి జన గామ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేప ట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు వినతిపత్రం అందజేశారు. కాగా పాద యాత్రను మోకు కనకారెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలో జీడికల్ నుండి జనగామ వరకు బీటీ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిందని, దీంతో వాహన దారులు, ప్రజలు, జీడికల్ దేవస్థానంకు వెళ్లే సంద ర్శకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీడికల్ నుండి కొమ్మాయిపల్లె వరకు, గుమ్మడివెళ్లి నుండి సిరిపురం వరకు, కుందారం నుండి నేల పోగుల వరకు, సిరిపురం నుండి లింగాలఘణపురం వరకు, కళ్లెం నుండి ఎనబావి వరకు, నెల్లుట్ల నుండి నాగారం వరకు, అలాగే ఆలేరు నుండి నల్గొండ వెళ్లే ఫోర్ లైన్ రోడ్డు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అర్హులైన అందరికి ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇండ్లు వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని అన్నా రు. అలాగే దళితబందు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నియోజక వర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి డబల్ లైన్ రోడ్డుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. లేందంటే పోరాటం ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శేఖర్, మండల కార్యదర్శి బొడ్డు కర్ణాకర్, మండల బొడ్డు యాదగిరి, నాయకులు తూడి దేవదానం, గోసంగి శంకరయ్య, మబ్బు ఉప్పలయ్య, పోచయ్య, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.