Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి
- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని రఘునాథపల్లి గ్రామం నుండి టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి ఎడ్ల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు కోల రాజకుమార్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ నుండి 50 మంది నాయకులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్వతోముఖాభివద్ధికి కృషి చేస్తు న్నాడని, దీనికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నార న్నారు. పార్టీలో చేరిన వారి స్థాయికి తగ్గకుండా సముచితమైన స్థానం కల్పిస్తామన్నారు. రఘునాథ్ పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం డైరెక్టర్ నూతనకంటి, నియోజకవర్గ కోఆర్డినేటర్ పసునూరి మహేందర్ రెడ్డి ,ఇల్లందుల శ్రీనివాస్ , కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ
రాష్ట్రంలో అభివద్ధి నిరంతరంగా సాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని తమ్మడపల్లి జి, ఓగ్లాపూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరలు, పెన్షన్ కార్డులను పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ సంస్కతీ, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగని అన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికా రికంగా ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆడప డుచులందరికీ బతుకమ్మ చీరలను అందిస్తుందని తెలిపారు. బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక , దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతంల్లో ఘనంగా నిర్వహిస్తు న్నారని అన్నారు. అనంతరం తమ్మడపల్లి జి గ్రామంలో ఎమ్మెల్యే సిడిఎఫ్ నిధులు రూ.5లక్షల తో నిర్మించిన అంతర్గత సిసి రోడ్డును ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజు, ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పిటిసి బేబీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కనకయ్య, సర్పంచులు నీరజ రెడ్డి, అశోక్, ఎంపీటీసీ శివయ్య ,మార్కెట్ డైరెక్టర్లు. వరుణ్, రాజకుమార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.