Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శంకర్‌నాయక్
నవతెలంగాణ -నెల్లికుదురు
ప్రతి పేద కుటుంబం అభివద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికలో షాదీ ముబా రక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని తాసిల్ధార్ యోగేశ్వ రరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిస్తుండడంతో పేదలు అభివద్ధి చెందుతున్నారని అన్నారు. ముదిరాజుల అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తు న్నారన్నారు. బతుకమ్మ చీరలను 20వేల పదిహే నుమందికి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి, జెడ్పీ టీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్, ఫిషరీష్ డిిస్టిక్ట్ ఆఫీసర్ నాగమణి, ఎంపీటీసీ వాణి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ పాల్గొన్నారు.