Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
గిరిజన సంఘం హనుమకొండ సౌత్ మండల కమిటీని సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పల్లకొండ శ్రీకాంత్, అధ్యక్షురాలుగా బానోత్ రమ, సహాయ కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా కళ్యాణ్, మౌనిక, స్వరూప, కరుణ, సునీత, మాల్యా, వీరన్న, లక్ష్మణ్, సుదర్శన్, అనిత, భద్రు, బండి రాజు, జ్యోతి, నాగరాజు, గౌతమి, లక్ష్మణ్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వాంకుడోత్ వీరన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం పేదలకు అందకుండా చేస్తోందని విమర్శించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు దూడపాక రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు ఎన్నం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.