Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యతతో పాటు సరసమైన ధరలకే వస్త్రాలు
- ఓరుగల్లు మహిళల మనసు గెలిచే డిజైన్లు
- బుల్లితెర స్టార్ యాంకర్ సుమ
- బాలసముద్రంలో స్టోర్ ప్రారంభం
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
నమ్మకానికి, నాణ్యమైన వస్త్రాలకు కేరాఫ్‌గా కళాధర్ ఫ్యాబ్రిక్ షోరూమ్ నిలుస్తోందని బులితెర స్టార్ యాంకర్, నటి సుమ కనకాల తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ ఎదుట ఏర్పాటు చేసిన ఆ షోరూమ్‌ను బుధవారం ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్టోర్‌లోని నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల బట్టలను పరిశీలించారు. అనంతరం 'పరిణయ-ద వెడ్డింగ్ స్టూడియో'ను ప్రారంభించి మాట్లాడారు. కళాధర్ ఫ్యాబ్రిక్స్ వస్త్ర ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చిందని చెప్పారు. నాణ్యమైన, బ్రాండెడ్ బట్టలను తక్కువ ధరలకే ప్రజలకు అందిస్తోందని తెలిపారు. ఓరుగల్లులో ఇది రెండో బ్రాంచ్ అని, ప్రజల ఆదరణ వల్లే నిర్వాహకులు మరో బ్రాంచ్ ఓపెన్ చేశారన్నారు. దసరా, దీపావళీ పండగ సందర్భంగా మంచి డిజైన్లు, వస్త్రాల కోసం షోరూమ్‌లో షాపింగ్ చేయాలని ప్రజలకు సూచించారు. అనంతరం షోరూమ్ యజమాని రాచబత్తుని అజరు కుమార్ మాట్లాడారు. షోరూమ్‌లో నాణ్యమైన బట్టలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు సరికొత్త డిజైన్లు, వస్త్రాలను స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన షాపుల్లోనూ దొరకని బ్రాండ్లు సైతం షోరూమ్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని వివరించారు.