Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గుర్రం జాషువా స్ఫూర్తితో ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ కోరారు. ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాజీపేటలోని సిద్ధార్థనగర్ లో, మనుమకొండలోని నాగేంద్రనగర్‌లో, రాంనగర్‌లోని సుందరయ్య భవన్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడారు. జాషువా కవితలతో పీడిత ప్రజలను మేల్కొల్పినట్టు తెలిపారు. కులాంతర వివాహం చేసు కోవడంతోపాటు సతీసహగమనానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలు నిర్మించారని చెప్పారు. తిరదౌషి, గబ్బిలం లాంటి రచనల ద్వారా ప్రజాచైతన్యానికి బాటలు వేశారని కొనియాడారు. జాషువా స్ఫూర్తితో సమాజం లోని అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా సంఘం పోరాడుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య, ఉపాధ్యక్షుడు దూడపాక రాజేందర్, సహాయ కార్యదర్శి గడ్డం అశోక్, జిల్లా నాయకులు అర్షం రాంకీ, కిషోర్, శ్రీకాంత్, జంపన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ కాలేజీలో..
సుబేదారి : సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగ అధిపతి చిర్ర రాజు ఆధ్వర్యంలో జాషువా జయంతి నిర్వహించగా ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య హనుమంత్, మామిడి లింగయ్య, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మెన్ కరుణాకర్‌రావు, అధ్యాపకులు శేషు, రమేష్, రహీమ్, మోహన్, ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు.