Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
మతోన్మాదంపై పోరాటం చేయడమే భగత్ సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి తెలిపారు. భగత్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హనుమకొండలోని సుందరయ్య భవన్ లో బుధవారం నిర్వహించిన భగత్‌సింగ్ 115వ జయంతి కార్యక్ర మానికి వాసుదేవరెడ్డి హాజరై భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. భగత్‌సింగ్ 'నాస్తికుని ఎలా అయ్యా ను' అనే పుస్తకంలో మతోన్మాదంపై వైఖరిని స్పష్టం చేయగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు యువతను, ప్రజలను తప్పుదారి పట్టిసు న్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యో గాలు భర్తీ చేస్తామని నమ్మించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి విస్మరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ యువతకు ఉపాధి లేకుండా కుట్ర చేస్తోందని తెలిపారు. యువత భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, ప్రజాసంఘాల నాయకులు గొడుగు వెంకట్, సాంబయ్య, డీవైఎఫ్ఐ నాయకులు మాచర్ల సతీష్, రాజేష్, అనిల్, కుమార్, మహేష్ పాల్గొన్నారు.
సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో..
డీవైఎఫ్ఐ హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మంద సంపత్ ప్రారంభించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్, సంపత్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, గుండ్ర సంధ్య, మోతె సతీష్, పల్లకొండ శ్రీకాంత్, రాంకీ, కరుణాకర్, సందీప్, జంపన్న, రాణి, రవీందర్, అనిల్, అరవింద్, యువన్, వినరు, తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ యువతకు ఆదర్శం : కన్వీనర్
హన్మకొండ చౌరస్తా : దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్ యువతకు ఆదర్శమని హనుమకొండ జేఏసీ జిల్లా కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ తెలిపారు. హనుమకొండ మర్కాజీ స్కూల్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భగత్‌సింగ్ చిత్రపటానికి క్రాంతికుమార్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, ప్రజాసంఘాల నాయకులు డీజీ శ్రీనివాస్, తాడిశెట్టి సుప్రజ, మైనార్టీ సెల్ నాయకుడు ముక్తార్, పాన్ షాప్ అసోసియేషన్ నాయకులు ప్రభాకర్, సంపత్ పాల్గొన్నారు.
హసన్‌పర్తి : గుండ్లసింగారంలోని ఇందిరమ్మ కాలనీలో భగత్‌సింగ్ చిత్రపటానికి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడగా సీపీఐఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి సూదమల్ల భాస్కర్, అనిల్, టీఆర్ఎస్ నాయకులు ఎడ్ల రమేష్, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్, డీవైఎఫ్ఐ నాయకులు అశోక్, నరేష్, రామకృష్ణ, శ్రావణ్ పాల్గొన్నారు.