Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన సభ నిర్వహించగా తొలుత ఏఓ శ్వేత మాట్లాడారు. మండలంలో రైతు బీమా కోసం కొత్తగా 330 మంది నమోదు చేసు కోగా మొత్తం 5 వేల 94 మంది రైతులకు రైతు బీమా ఉందని చెప్పారు. అలాగే 78 మంది రైతులు చనిపోగా 76 కుటుంబాలకు బీమా డబ్బులు అందా యన్నారు. మండలంలో 17 వేల 125 ఎకరాల్లో వివిధ పంటలు వేశారని చెప్పారు. పశుసంవర్ధక డాక్టర్ దీపిక మాట్లాడుతూ మండలంలో 3 వేల 246 పశువులకు టీకాలు వేశామన్నారరు. కొద్ది రోజు లుగా లంపి వ్యాధి వస్తోదని, ఇప్పటివరకు మండలం లో ఆ వ్యాధి నమోదు కాలేదన్నారు. సర్పంచ్ శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని నిలదీయడంతో స్థలాన్ని ఎంపిక చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాని తహసీల్దార్ సమాధానమిచ్చారు. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో చెప్పాలని సర్పంచ్ పట్టుబట్టడంతో సభ గందరగోళంగా మారింది. తన పదవి కాలం మూడున్నరేండ్లు గడ చినా ప్రజలకు నీటిని అందించలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర శాఖల అధికారులు నివేదికలను వెల్లడించారు. జెడ్పీటీసీ కల్పన మాట్లాడుతూ కొత్త మండలం అయినప్పటికీ ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎంపీపీ శంకర్ మాట్లాడుతూ అభివద్ధిలో మండలం అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.