Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలను కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మండలంలోని మొట్లపల్లిలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గూడూరు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని చెప్పారు. అందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ హాఈలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యంతోనే ప్రజలను చిత్తు చేస్తు అధికార దాహంతో కుటుంబ పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని, అది మరోసారి మునుగోడు ఉపఎన్నికతో నిరూపితం అవబోతోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, జిల్లా నాయకులు వంగ మహేష్, మండ రవి, మండల నాయకులు గూడూరు సదన్ రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్, రవీందర్, కుమార స్వామి, అశోక్, సతీష్, దేవేందర్, అజరురెడ్డి తదితరులు పాల్గొన్నారు.